N.V.Ramana: జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్: జస్టిస్ ఎన్వీ రమణ

మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

N.V.Ramana: జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్: జస్టిస్ ఎన్వీ రమణ

N.v.ramana

N.V.Ramana: మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Credit Cards: క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి

‘‘తిరుపతితో ఎన్టీఆర్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, కథా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారు. ఎన్టీఆర్‌ జనం నాడి తెలిసిన వ్యక్తి. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారం దక్కించుకున్న సంచలన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయనతో నాకెంతో సన్నిహిత సంబంధం ఉండేది. నాపై ఎన్టీఆర్‌ మనిషి అనే ముద్ర వేశారు. దీనికి నేనెంతో గర్విస్తున్నాను. కాలేజీలో చదివే రోజుల్లోనే నేను ఆయన అభిమానిని. 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశాను. సంక్షోభ సమయంలో ఆయన తరఫున వాదించడానికి ఎవ్వరూ లేరు. కానీ, ప్రజాభిమానంతో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూశాను. అప్పట్లో ఢిల్లీకి ఆయన నన్ను తీసుకెళ్లేవారు. ఆయనకు మందులు అందించేవాడిని. నేను రిటైర్ అయ్యాక ఎన్టీఆర్‌ గురించి పుస్తకం రాస్తాను.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ నన్ను నాన్న అని పిలిచేవారు. వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడిని. ఎన్టీఆర్‌కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం దురదృష్టకరం. తెలుగుజాతి ఐక్యంగా ఉండాల్సింది. ఈ విషయంలో తమిళనాడు ఆదర్శం. ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా అందరూ కృషి చేయాలి. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఊరూవాడా జరగాలి’’ అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.