జనసేన సత్తా చూపిస్తాం : రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కలవలేదు

బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 10:42 AM IST
జనసేన సత్తా చూపిస్తాం : రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కలవలేదు

బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం

బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం అన్నారు. బీజేపీ-జనసేన కలయిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. జనసేనాని పవన్ తన వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కలవలేదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో జత కట్టారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బీజేపీ-జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామన్నారు. విభజన చట్టం హామీల అమలుకు జనసేన కృషి చేస్తుందన్నారు. ప్రధాని మోడీ నిర్ణయాలతో భారత్ మరింత బలపడుతుందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.

modie

ప్రధాని శంకుస్థాపన చేసిన చోటే రాజధాని…
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టాయని చెప్పారు. రాజధాని విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలన్నారు.