టీడీపీ ప్రభుత్వం ఫెయిల్…ఏడీఆర్ సర్వే

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 2, 2019 / 02:12 PM IST
టీడీపీ ప్రభుత్వం ఫెయిల్…ఏడీఆర్ సర్వే

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది. నిరుద్యోగం,త్రాగునీరు,వ్యవసాయ మౌళిక సదుపాయాల విషయంలో కూడా టీడీపీ ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని తెలిపింది. సోమవారం (ఏప్రిల్-2,2019) ఈ సర్వే రిలీజ్ అయింది. 
Read Also : పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా : పవన్‌కు ప్రశ్న

మంచి ఉద్యోగ అవకాశాలు,త్రాగునీరు,డీసెంట్ హాస్పిటల్స్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనే మూడు అంశాలు ఓటర్ల టాప్ ప్రేయారిటీస్ గా ఉన్నాయని ఈ సర్వే తెలిపింది.ఈ మూడు అంశాల్లో రాష్ట్రవ్యాప్తంగా  చంద్రబాబు సర్కార్ పనితీరు చాలా అద్వానంగా ఉందని తెలిపింది.

 గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి సాగునీరు,విత్తనాలపై సబ్సీడీ,ఎరువులు,కంపెనీలకు ఎలక్ట్రిసిటీ అంశాలు ట్రాప్ ప్రేయారిటీస్ గా ఉన్నాయని…అయితే ఈ విషయాల్లో టీడీపీ సర్కార్ పనితీరు పట్ల  ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని,బాబు సర్కార్ కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారని ఏడీఆర్ సర్వే తెలిపింది.

పట్టణ ఆంధ్రప్రదేశ్ లో బెటర్ ఎంప్లాయిమెంట్,డ్రింకింగ్ వాటర్,పొల్యూషన్ అంశాలు ఓటరు టాప్ ప్రేయారిటీస్ గా ఉండగా…ఇక్కడ కూడా టీడీపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే తెలిపింది.సగటు ఓటరు ముఖ్యమైన 10 ప్రేయారిటీస్ లో ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని తెలిపింది.2018 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2018 మధ్యలో ఈ సర్వే నిర్వహించినట్లు ఏడీఆర్ తెలిపింది.
Read Also : తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు