Hindupuram : సీమ నీటి కోసం ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దాం

సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. .హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.

Hindupuram : సీమ నీటి కోసం ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దాం

Balakrishna

Nandamuri Balakrishna : సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. సీమకు నికరజలాలు అందించాలని, నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు, నీళ్లు తెచ్చేందుకు ఎన్టీఆర్, చంద్రబాబులు కృషి చేశారని చెప్పుకొచ్చారు. కులాలు, మతలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ…నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. 2021, అక్టోబర్ 17వ తేదీ ఆదివారం అనంతపురం..హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.

Read More :AP : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!

రాయలసీమలో వ్యవసాయం అనేది ఒక జీవనోపాధి అని, ఒకప్పుడు రతనాల సీమగా ఉండే ఈ ప్రాంతం..ఇప్పుడు కరవు సీమగా మారిపోయిందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాన్న..ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. రాయలసీమలో బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి ఎన్టీఆర్ హంద్రీనీవా..రూపకల్పన చేయడం జరిగిందన్నారు. మద్రాసుకు నీరు ఇవ్వడానికి తెలుగు గంను తెచ్చారనే విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. హంద్రీనీవా నుంచి కనీసం చెరువులకు నీరు అందించే ఆలోచన వైసీపీ ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. నిర్విరామంగా ప్రవహిస్తున్నా..పూర్తిస్థాయిలో చెరువులకు నీరు అందించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు.

Read More : Dasara : దసరా ఎంజాయ్, రూ. 222.23 కోట్ల లిక్కర్, 50 లక్షల చికెన్ సేల్!

హింద్రీనీవా కింద ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని, గత ఏడాది నీళ్లు వచ్చినా..ఇదే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో అన్ని చెరువులకు నీరు అందించాలి… కరవు పోయేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. గోదావరి, పెన్నా అనుసంధానం జరగాలని, సీమకు నికర జలాలు అందించాలన్నారు. ఒకవైళ అవసరమైతే…నీటి కోసం ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బాలకృష్ణ.