టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

టీడీపీకి షాక్..జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి

ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 
2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే అనారోగ్య కారణాలతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని.. తన కుమార్తె కు నంద్యాల లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించాలని కోరగా…అందుకు చంద్రబాబు నిరాకరించారు. ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా శివానందరెడ్డిని బరిలో దించారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసిన ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరారు.

×