Nara Bhuvaneshwari : మొట్టమొదటిసారిగా స్పందించిన నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

Nara Bhuvaneshwari : మొట్టమొదటిసారిగా స్పందించిన నారా భువనేశ్వరి

Bhuvaneshwari Nara

Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యల దుమారం ఇప్పటికే రాజకీయ వర్గాలను హీటెక్కిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Read Also : Jr NTR Fans : జూ.ఎన్టీఆర్ చేసిన తప్పేంటి? ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్విట్టర్‌లో #CBNShouldApologizeJRNTR ట్రెండింగ్

ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచొద్దని.. వారి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించొద్దని నారా భువనేశ్వరి తన ప్రకటనలో కోరారు. “ఆంధ్రప్రదేశ్ శాసన సభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తంచేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి/తోబుట్టువుకు/కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మరిచిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. కష్టాల్లో/ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం.. మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను” అని నారా భువనేశ్వరి తన లేఖలో ప్రస్తావించారు.

Nara Bhuvaneshwari Letter

Nara Bhuvaneshwari Letter