Nara Lokesh: నాపై ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు ఒక్కటే ప్రూవ్ అయింది : నారా లోకేశ్

యెస్. నేను దుబాయ్ లో నా కుటుంబసభ్యులతో వున్నా. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన.. డ్రగ్స్ హెవెన్ 'ఐవరీ కోస్ట్' టూర్ పైనా.

Nara Lokesh: నాపై ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు ఒక్కటే ప్రూవ్ అయింది : నారా లోకేశ్

Lokeshbabu2

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వార్తలు.. రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు.. ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటున్నారు. ఏపీ డ్రగ్స్ గా మారిందని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఐతే.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ వ్యాపారం చేస్తోందని డౌట్ గా ఉందని… లోకేశ్ అందుకే దుబాయ్ టూర్ కు వెళ్లాడేమో అని వైసీపీ నాయకుడు, ఏపీ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో… ఈ డ్రగ్స్ ఎపిసోడ్ పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు సుర్రుమనిపిస్తోంది.

Read This : Tirumala Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

సజ్జల.. బొంబాయి కబుర్లు మానండి
సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఘాటైన వ్యాఖ్యలు చేశారు నారా లోకేశ్. “డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని… డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపండి” అని డిమాండ్ చేశారు లోకేశ్.

నామీద ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు ఒక్కటే
“నలభై ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరే ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా?” అని ప్రశ్నించారు నారా లోకేశ్.

Read This : Lakhimpur Kheri Violence : లఖిమ్‌పూర్‌ ఘటన విషయంలో సుప్రీం జోక్యం.. సీజేఐ నేతృత్వంలో వాదనలు
సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటీ కేసులతో.. ఆర్థిక ఉగ్రవాదిగా జగన్ రెడ్డి మారారనీ.. ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారని కౌంటరిచ్చారు. రూ.72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులోనూ జగన్ ఏ1 గా ఉన్నారన్నారు.

ఎస్… ఫ్యామిలీతో దుబాయ్‌లోనే ఉన్నా
“ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం మాది. జనం ప్రాణాలు తీసి..లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి. యెస్. నేను దుబాయ్ లో నా కుటుంబసభ్యులతో వున్నా. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన.. డ్రగ్స్ హెవెన్ ‘ఐవరీ కోస్ట్’ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? సజ్జలా!” అని కామెంట్ చేశారు లోకేశ్.