చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారు, కులం పేరుతో రైతులకు పథకాలు కట్ చేస్తున్నారు

10TV Telugu News

nara lokesh : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు లోకేష్. గుంటూరు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో శుక్రవారం(అక్టోబర్ 30,2020) మీడియాతో మాట్లాడారు లోకేష్. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొల్లేరు ప్రాంత రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు లోకేష్.

వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందలేదని ఆరోపించారు. రైతు భరోసా విషయంలోనూ రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. రైతులకు కులం పేరు పెట్టి పథకాలు కట్ చేస్తున్నారని చెప్పారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని లోకేష్ చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని లోకేష్ హెచ్చరించారు.

10TV Telugu News