AP 10th, Inter Exams : సీఎం జగన్‌‌కు నారా లోకేష్ లేఖ…పరీక్షలు రద్దు చేయాలి

సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

AP 10th, Inter Exams : సీఎం జగన్‌‌కు నారా లోకేష్ లేఖ…పరీక్షలు రద్దు చేయాలి

Nara Lokesh

Nara Lokesh : సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఈ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు విద్యార్థుల ఆరోగ్యానికి, జీవితానికి ప్రాధాన్యం ఇచ్చిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

విద్యా సంవత్సరం నష్టపోకుండా..కేంద్రం, ఇతర రాష్ట్రాల పరీక్షలకు ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించాలన్నారు. ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగా..విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయని తెలిపారు. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ఈ పరిస్థితుల్లో పిల్లలను పరీక్షలకు పంపేందుకు తల్లిదండ్రులు మానసికంగా సిద్ధంగా లేరని నారా లోకేష్ వెల్లడించారు. మే నెల చివరి రెండు వారాల్లో పది శాతం కంటే ఎక్కువగా 18 ఏళ్లలోపు..పిల్లలపై కరోనా ప్రభావం చూపిందని, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేలా పరీక్షల నిర్వాహణకు ప్రభుత్వం మొండిపట్టు పట్టడం తగదని హితవు పలికారు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా..80 లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా పరీక్షల నిర్వాహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం దుర్మార్గమని లేఖలో వెల్లడించారు.

Read More : Uttar Pradesh Politics : ఢిల్లీలో యోగి మార్క్, నాయకత్వ మార్పులేనట్లే ?