Nara Lokesh : ఆగిన నారా లోకేశ్ పాదయాత్ర.. ఎందుకంటే
Nara Lokesh : యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వచ్చారు లోకేశ్.

Nara Lokesh (Photo : Twitter)
Nara Lokesh – Mahanadu : టీడీపీ నేత నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. లోకేశ్ విజయవాడ చేరుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వెళ్లారు లోకేశ్. మహానాడులో పాల్గొనేందుకు 4 రోజుల పాటు యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు లోకేశ్. మహానాడు ఏర్పాట్లు, కమిటీల పనితీరుపై లోకేశ్ సమీక్షించారు. రేపు (మే 26) విజయవాడ నుంచి చంద్రబాబు, లోకేశ్ రాజమండ్రి వెళ్లనున్నారు. మహానాడు ప్రాంగణానికి ఒకరోజు ముందుగానే చంద్రబాబు, లోకేశ్ చేరుకోనున్నారు.
పాదయాత్రను 4 రోజుల పాటు నిలిపేయనున్నారు లోకేశ్. మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుండడమే ఇందుకు కారణం. అందులో పాల్గొనేందుకు.. యాత్రకు విరామం ప్రకటించారు లోకేశ్. తిరిగి ఈ నెల 30న తన యాత్రను కంటిన్యూ చేయనున్నారు.
ప్రస్తుతం జమ్మలమడుగులో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. రేపు (మే 26) అమరావతి నుంచి బయలుదేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.
ఇవాళ( మే 25) జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Also Read..TDP Mahanadu : మహానాడుకు రండీ .. చంద్రబాబు డిజిటల్ సంతకంతో ప్రతినిధులకు ఆహ్వానం