ఓ దిశా నువ్వెక్కడ ? : మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా – లోకేష్ ట్వీట్

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 10:13 AM IST
ఓ దిశా నువ్వెక్కడ ? : మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా – లోకేష్ ట్వీట్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫొటోలు, కామెంట్స్ పోస్టు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తన పేరిట ఏదో ఒక ట్వీట్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి నెలకొంది.

కానీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని, అభ్యర్థులను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. తాజాగా నారా లోకేష్ దీనికి సంబంధించిన అంశంపై ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. 

ఓ దిశ నువ్వెక్కడ? రాష్ట్రంలో మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా ? భౌతిక దాడికి దిగి నామినేషన్ పత్రాలు చించేస్తారా ? పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు దళిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

Read More : ప్రేమించి మోసగించాడని ఎన్నికల్లో పోటీకి దిగిన యువతి

అంతేగాకుండా..రైతుల గురించి కూడా ట్వీట్ చేశారు. ‘రూ.12,500ల రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్.. ఇలా అన్నీ కలిపి, ఏడాదికి రైతుకి లక్ష రూపాయలు లబ్ది అన్నారు. లక్ష మాట దేవుడెరుగు.. కనీసం సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం 10 నెలల్లో 400 మంది రైతుల్ని బలి తీసుకుంది’ అంటూ ఓ ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.