Nara Lokesh : తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి..ప్రతి రైతు-కౌలు రైతుకి సాయం అందించాలి

ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వరి పండిస్తారని, వర్షాల కారణంగా...భారీగా నష్టం ఏర్పడిందన్నారు.

10TV Telugu News

Nara Lokesh : తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు..ప్రతి రైతు-కౌలు రైతుకి సాయం అందించాలన్నారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇటీవలే కురిసిన వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని సూచించారు. పంట చేతికందే సమయంలో వచ్చిన వర్షాలకు పంటలు నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ సంవత్సరం వచ్చిన తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 2021, నవంబర్ 27వ తేదీ శనివారం సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.

Read More : ఏపీకి భారీ వర్ష సూచన

పశ్చిమగోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను లేఖ ద్వారా తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వరి పండిస్తారని, వర్షాల కారణంగా…భారీగా నష్టం ఏర్పడిందన్నారు. అప్పులుచేసి పెట్టుబ‌డులు పెట్టిన పంట మొత్తం నాశనం కావడంతో కన్నీళ్లపర్యంతమవుతున్నట్లు, రెండుసార్లు నాట్లు వేసి పంట కోల్పోయారన్నారు. ఎక్కడ చూసినా వర్షాలకు కుళ్లిన పంట‌లు, నేలకొరిగిన చేలు, మొలకలెత్తుతున్న ధాన్యమే కనిపిస్తున్నాయని లేఖలో వెల్లడించారు.

Read More : New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?

రెండు జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టం ఏర్పడిందని అంచనా వేశారు. చాలా చోట్ల పంట తడిసిపోయి మొలకలు కూడా వస్తున్నాయని, ఎలాంటి షరతులు లేకుండా పూర్తి మొత్తం చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో సూచించారు. నామ్‌కే వాస్తేగా ఉన్న రైతుభ‌రోసా కేంద్రాలు రైతుల‌కు అండ‌గా నిలిచే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం విషయంలో ఉన్న నిబంధనలను సవరించి..నష్టపోయిన ప్రతి రైతు – కౌలు రైతుకి సాయం అందించాలని లోకేష్ లేఖలో కోరారు.

×