Srikakulam Youth: నాసా స్పేస్ రోబోటిక్స్‌లో శ్రీకాకుళం యువ టాలెంట్

అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నాడు శ్రీకాకుళం యువకుడు. నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌లో ఓ టీం తరపున ప్రాతినిధ్యం వహించి టాలెంట్ నిరూపించుకున్నాడు.

Srikakulam Youth: నాసా స్పేస్ రోబోటిక్స్‌లో శ్రీకాకుళం యువ టాలెంట్

Nasa Space Robotics

Srikakulam Youth: అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నాడు శ్రీకాకుళం యువకుడు. నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌లో ఓ టీం తరపున ప్రాతినిధ్యం వహించి టాలెంట్ నిరూపించుకున్నాడు. సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను సమకూర్చుకోవడంతో పాటు వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అనే అంశాలపై వర్చువల్‌ విధానంలో రోబోటిక్‌ సాప్ట్‌వేర్‌ తయారీపై నాసా స్పేస్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ సంస్థ పోటీ నిర్వహించింది.

ఇందులో విశ్వవిజేతగా నిలిచిన బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ ఒకరు. అతనితో పాటుగా అలెంసాండ్రో డిఫావ, వెక్టర్‌ లోపెజ్, డేవిడ్‌ ఫెర్నాండెజ్‌ లోపెజ్, ఫియర్‌ ఫెర్న్‌బాచ్, లూకా మర్కియాని, ఆద్రియా రోయజ్‌ మొరెనో, నాసిన్‌ మిగేల్‌ బాన్యోస్‌‍‌లు సభ్యులు. విజేతగా నిలిచిన వీరు రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్‌ రోబోటిక్స్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయికిశోర్‌ తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్‌ మోన్స్‌ టీంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు.

…………………………………………………. : ఆర్యన్ కేసుతో ఆగిపోయిన షారుఖ్ సినిమాలు

114 టీంలను దాటుకుని..
మల్టీ–రోబో టీం అంతరిక్షంలోకి వెళ్లే విధానం.. త్వరగా ఖనిజాన్ని సేకరించే ప్రోసెస్.. జీపీఎస్‌ లేకుండా పనిచేసుకుని, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది టీం. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో వెదికి, తవ్వి లోడ్ చేసి, మోసుకొచ్చేలా రోబోలకు సాఫ్ట్ వేర్ డిజైన్ చేశారు. ఇవన్నీ దేని పని అది చేసుకుంటాయి.

ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 114 టీంలు పాల్గొనగా 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్‌ మోన్స్‌ టీం ఫస్ట్ పొజిషన్‌లో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్‌ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్‌ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం.