Somu Veerraju: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ వెయ్యాలి.. సోము వీర్రాజు డిమాండ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.

Somu Veerraju: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ వెయ్యాలి.. సోము వీర్రాజు డిమాండ్!

Somu

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు. కొత్త జిల్లాల్లో ఏ ప్రాంతాలు కలవాలి, ఏ నగరం ముఖ్యపట్టణంగా ఉండాలి. ఎవరి పేరు పెట్టాలి అనే విషయాలను తేల్చడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అందుకోసం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.

పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాల ఏర్పాటు బీజేపీ జాతీయ విధానమేని, ఏపిలో కూడా 25 జిల్లాలు చేస్తామని ఎప్పుడో 2014 మేనిఫెస్టోలోనే ప్రకటించామని అన్నారు సోము వీర్రాజు. పార్టీపరంగా పార్లమెంటు జిల్లాలనే కార్యకలాపాలకు ఎంచుకున్నామని చెప్పారు.

జగన్ సర్కారు తీసుకున్న జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా అవసరం అని అన్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారిదే రాజ్యాంగమనీ, జగన్ వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ఎన్నికల్లో విజయం కంటే రాజ్యాంగం సమున్నతమైనదని అన్నారు.

ప్రజలు గెలిపించారు కనుక తామన్నదే రాజ్యాంగం అంటే ఒప్పుకోమని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలని, అబ్దుల్ కలామ్ టవర్ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ రాజుల పేర్లు కూడా మార్చి KGH, GGHలకు స్థానిక నేతల పేర్లు పెట్టాలని, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం వంటివారికి గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.