Nellore GGH : నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటన.. ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదు

నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి.

Nellore GGH : నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటన.. ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదు

Nellore Ggh

Nellore GGH : నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి. కీచక డాక్టర్ అరాచకాలపై డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీ కూడా మధ్యాహ్నంలోపు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికలను అందించే అవకాశం ఉంది. డీఎంఈ తరుఫు కమిటీ ఇంటర్నల్ విచారణ పూర్తవడంతో నివేదిక డీఎంఈకి చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇద్దరు బాధితులను కమిటీ సభ్యులు విచారించారు. నేరం రుజువైతే కీచక డాక్టర్ పై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి.

జీజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటు బాధితురాలిని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అలాగే మరికొందరు మెడికోలు, హౌస్ సర్జన్లను కూడా విచారించారు. సంచలనం రేపిన ఆడియో గురించి కమిటీ సభ్యులు ప్రశ్నించగా… ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని సూపరింటెండెంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు విచారణ కమిటీ ముందు ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, లైంగిక వేధింపుల ఘటన కొన్ని నెలల క్రితం జరిగినట్లు కమిటీలు తమ విచారణలో తేల్చాయి.