Nellore GGH : నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు చేసినట్లు తేలింది. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సస్పెండ్ చేసింది.

Nellore GGH : నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

Ggh

Superintendent GGH : నెల్లూరు ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు చేసినట్లు తేలింది. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సస్పెండ్ చేసింది. హౌస్‌సర్జన్లను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఓ వైద్య విద్యార్థిని బయటపెట్టిన ఆడియో కలకలం రేపింది. కూతురు వయసున్న వైద్యవిద్యార్థినితో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు.

కొంతకాలం ఓపిక పట్టిన ఆ విద్యార్థిని తర్వాత విషయాన్ని బయటపెట్టింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెండు కమిటీలు విచారణ చేశాయి. హౌస్‌ సర్జన్లతో పాటు పలువురిని ప్రశ్నించారు. అయితే అందులోని ఆడియో తనది కాదని ప్రభాకర్ వాదించారు. అయితే కమిటీలు ఆయన తప్పు చేసినట్లు ప్రాధమికంగా తేల్చాయి. ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని కొన్ని నెలల క్రితం జరిగినట్లు గుర్తించారు. రెండ్రోజుల క్రితం దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. అప్పటికే ఓ నివేదిక ఆధారంగా ఆయన్ను బదిలీ చేశారు.

Read More : Priyanka Gandhi : జిమ్మేదార్ కౌన్..కేంద్రం కోవిడ్ లెక్కలపై ప్రియాంక ఫైర్