కారు డిక్కీలో కోటి రూపాయలు, నెల్లూరు జిల్లాలో కలకలం

నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం రేగింది. కారులో కోటి రూపాయల నగదు కనిపించింది. కోవూరు పరిధిలోని జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారు డిక్కీలో కోటి రూపాయలు, నెల్లూరు జిల్లాలో కలకలం

Nellore Police Seize One Crore Currency In Car1

nellore police seize one crore currency in car: నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం రేగింది. కారులో కోటి రూపాయల నగదు కనిపించింది. కోవూరు పరిధిలోని జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురానికి చెందిన ప్రవీణ్‌జైన్‌ బంగారు దుకాణం వ్యాపారి. అతడు తన దగ్గర పనిచేసే హరిబాబు, రాజేష్‌ అనే గుమస్తాలను కారులో నెల్లూరులోని గుప్తా పార్కు ప్రాంతానికి చెందిన రాజేంద్రబాబు దగ్గరికి సోమవారం(మార్చి 15,2021) సాయంత్రం పంపాడు. గుప్తా వారికి కోటి రూపాయల క్యాష్ ఇచ్చాడు. ఆ నగదు తీసుకుని గుమాస్తాలు కారులో బయలుదేరారు.

కాగా, కోవూరు పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ కారుని కూడా తనిఖీ చేశారు. కారు డిక్కీ ఓపెన్ చేయగా పోలీసులు షాక్ అయ్యారు. అందులో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు ఉన్నాయి. వాటిని లెక్కించగా కోటి రూపాయలు ఉంది.

సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదుని స్వాధీనం చేసుకున్నారు. గుమస్తాలిద్దరిపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా కారులో కోటి రూపాయల నగదు తరలిస్తున్నట్లు కోవూరు పోలీసుస్టేషన్‌కు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చాడని, దాంతో నిఘా పెట్టి నగదుని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.