Nellore ycp politics : అంతకంతకూ హీటెక్కుతున్న నెల్లూరు పాలి‘ట్రిక్స్’..అనిల్ వర్సెస్ ఆనం, మంత్రి కాకాణి

అంతకంతకూ హీటెక్కుతున్న నెల్లూరు పాలి‘ట్రిక్స్’..అనిల్ వర్సెస్ ఆనం, మంత్రి కాకాణి అన్నట్లుగా సాగుతున్నాయి. ఫ్లెక్సీల వివాదం కాస్తా అంతకంతకు పెరుగుతోంది. ఎవ్వరు ఏమాత్రం తగ్గటంలేదు.

Nellore ycp politics : అంతకంతకూ హీటెక్కుతున్న నెల్లూరు పాలి‘ట్రిక్స్’..అనిల్ వర్సెస్ ఆనం, మంత్రి కాకాణి

Nellore Ycp Politics

NLR YCP RAGADA : నెల్లూరు రాజకీయాలు.. థర్మా మీటర్లు కూడా పగిలిపోయేంత హీటెక్కుతున్నాయ్. అనిల్ వర్సెస్.. ఆనం, కాకాణి అన్నట్లుగా మారిపోయాయ్ పరిస్థితులు. ఈ మధ్యే చెలరేగిన ప్లెక్సీల వివాదం.. జిల్లాలో కొత్త సెగలు రేపింది. తాజాగా.. ఆనం రాంనారాయణ రెడ్డి.. అనిల్‌పై చేసిన కామెంట్స్‌తో.. రాజకీయం మరింత వేడెక్కింది. దీనికి తోడు.. మంత్రి కాకాణి.. జిల్లా ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతుండటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

వైసీపీకి కంచుకోట నెల్లూరులో.. పాలిటిక్స్ గిర్రున తిరుగుతున్నాయ్. లీడర్లకు.. సర్రున కోపాలు వస్తున్నాయ్. మాజీ మంత్రి అనిల్, మాజీ మంత్రి ఆనం, తాజా మంత్రి కాకాణి మధ్య రేగిన రగడ.. ఎక్కడి దాకా వెళ్తుందన్నది.. వారికే తెలియడం లేదు. మంత్రి హోదాలో.. తొలిసారి నెల్లూరుకు వచ్చిన కాకాణికి.. జిల్లా ఆఫీసు దగ్గర స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఇందులో.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.. మాజీ మంత్రి అనిల్‌పై విమర్శలు చేయడంతో.. వివాదం మరింత ముదిరింది. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకున్న ప్రాజెక్టులు.. జిల్లాలో మూలన పడ్డాయని.. అవి గత మూడేళ్లుగా ముందుకు సాగడం లేదని అన్నారు. వ్యవసాయ మంత్రిగా.. కాకాణి వాటిపైన కూడా అధికారులతో రివ్యూ చేయాలని కోరారు.

Also read : Ganta Srinivasa Rao : సెగలు రేపుతున్న గంటా శ్రీనివాసరావు కామెంట్స్..వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ హింట్

ముందు నుంచీ.. ఆనం రాంనారాయణ రెడ్డికి, అనిల్‌కు మధ్య విభేదాలున్నాయ్. నిజానికి.. అనిల్‌ని.. రాజకీయాల్లోకి తెచ్చింది ఆనం కుటుంబమే. 2009లో అనిల్ కాంగ్రెస్ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే.. తనను ఓడించింది ఆనం బ్రదర్సేనని.. అనిల్‌కు అప్పటి నుంచి డౌట్ ఉంది. అప్పట్లో.. సాగిన ప్రచారం కూడా ఇదే. అక్కడి నుంచి.. ఆనం కుటుంబానికి అనిల్ దూరంగా ఉంటున్నారు. తర్వాత.. జగన్ వెంట నడిచి.. విధేయుడిగా పేరు తెచ్చుకొని.. వైసీపీ పవర్‌లోకి రాగానే.. మంత్రి అయ్యారు. ఆనం రాంనారాయణ రెడ్డి కూడా వైసీపీలో ఉన్నా.. అనిల్‌తో వచ్చిన గ్యాప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

గతంలోనూ.. ఆనం రాంనారాయణ రెడ్డి.. నెల్లూరు సిటీ మాఫియాకు అడ్డాగా మారిందని.. ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు.. కాకాణి స్వాగత సభలో.. మాజీ మంత్రి అనిల్‌ను ఉద్దేశించి.. ఓ నాలుగు మాటలు అనేశారు. దీంతో.. వీళ్లిద్దరి మధ్య విభేధాలు మరో లెవెల్‌కు చేరినట్లైంది. అనిల్ కూడా ఆనం కామెంట్స్‌కి.. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రోజుకో పార్టీలో ఉండే వారి గురించి తాను పెద్దగా మాట్లాడనన్నారు. తమకంటూ.. ఓ పార్టీ లైన్, లీడర్, అధిష్టానం ఉన్నాయని.. ఆ లైన్ దాటి మాట్లాడితే.. కొందరికి తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదని స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. పెద్దోళ్లైపోయారు.. వయసు పైబడి.. చాదస్తం ఎక్కువైంది. అలాంటి వాళ్లు చేసిన విమర్శల గురించి ఏం పట్టించుకుంటామని.. సెటెర్లు కూడా వేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు.. జిల్లాకు 3 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు తెచ్చాని.. అందులో తనపై విమర్శలు చేసిన నాయకుడి నియోజకవర్గానికే వెయ్యి కోట్లు మంజూరుయయ్యాని చెప్పారు.

Also read : Visakha : డబ్బు బిల్డప్ ఉంటేనే మంత్రి పదవులు..ప్రజల కోసం అవసరమైతే ఉగ్రవాదిని అవుతా :YCP ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఇంతలోనే.. మరోసారి ప్లెక్సీ వివాదం తెరమీదికొచ్చింది. నెల్లూరు సిటీలో ఏసీ సెంటర్‌లోని పార్టీ ఆఫీసులో.. ఆనం రాంనారాయణరెడ్డితో పాటు ఆయన సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, వాళ్ల కుటుంబ సభ్యులు.. మంత్రి కాకాణిని కలిశారు. ఈ క్రమంలో.. మంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను.. గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో.. అనిల్ వర్గీయులే ఈ పని చేసి ఉంటారని.. ఆనం అనుచరులు ఆరోపిస్తున్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏ నియోజకవర్గం.. ఎవరి జాగీరు కాదని.. జనం దయతలిస్తేనే.. ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. ప్లెక్సీలు చించడం వల్ల క్యారెక్టర్ దెబ్బతింటుందని.. ఒక్క అనిల్‌కు మాత్రమే కాదు.. ఈ జబ్బు నెల్లూరు రూరల్‌ని ఉండేదన్నారు. ఇవన్నీ.. పార్టీకి మంచిది కాదని.. కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ బర్త్‌డే ప్లెక్సీల చించివేతను కూడా విజయ్ కుమార్ రెడ్డి ఖండించారు.

అయితే.. అనిల్ మాత్రం ప్లెక్సీల విషయంలో అదే స్టాండ్ మీద ఉన్నారు. నెల్లూరు సిటీలో.. ప్లెక్సీలు వేయకూడదనే రూల్.. తనతో పాటు అందరికీ వర్తిస్తుందన్నారు. ఇదే టైంలో.. మంత్రి కాకాణి.. అనిల్ తమ ప్లెక్సీలను తొలగించలేదని.. తాము కూడా అతని ప్లెక్సీలు తొలగించబోమని.. చెప్పారు. కొన్ని అసాంఘిక శక్తులు.. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకే.. ఇలా చేస్తున్నాయని.. ప్లెక్సీల రగడకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

Also read : Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్

మరోవైపు మంత్రి కాకాణి.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో.. వరుసగా భేటీ అవుతుండటం కూడా.. జిల్లాలో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో.. నెల్లూరు రాజకీయం మరింత రసవత్తరంగా మారే చాన్స్ ఉందంటున్నారు.