అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు యువకుడు కోలుకుంటున్నాడు

అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 05:48 AM IST
అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు యువకుడు కోలుకుంటున్నాడు

అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు

అమెరికాలో నల్లజాతీయుడి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నెల్లూరు జిల్లా యువకుడు డేగా ధీరజ్ రెడ్డి(28) కోలుకుంటున్నాడు. ఇవాళ(ఏప్రిల్ 13,2020) ఉదయం అతడు స్పృహలోకి వచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దుండగుడు మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇప్పటికే డాక్టర్లు ధీరజ్ శరీరం నుంచి మూడు బుల్లెట్లు తీశారు. రేపు సాయంత్రం మరో బుల్లెట్ బయటకు తీస్తామన్నారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లికి చెందిన డేగా ధీరజ్‌రెడ్డి(28) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మనుబోలు మండలం మడమనూరులో అమ్మమ్మ ఇంటిలో పెరిగాడు. బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం 2020 జనవరిలో అమెరికా వెళ్లాడు. అక్కడ ఛార్లెస్టోన్‌ ఈస్ట్రన్‌ ఇలినోయిస్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు.(26ఏళ్లకే.. లండన్ లో గుండెపోటుతో వరంగల్ విద్యార్థి మృతి)

ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు (అమెరికా కాలమాన ప్రకారం) నిత్యావసర సరుకుల కోసం ధీరజ్ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ధీరజ్‌పై నల్లజాతి యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ధీరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని లోయిస్‌లోని మెర్సి ఆసుపత్రిలో చేర్చారు. తలకు తీవ్ర గాయమైందని, కోమాలోకి వెళ్లాడని డాక్టర్లు చెప్పారు. ధీరజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు యువకుడిపై కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు, తెలుగువారిని ఆందోళనకు గురి చేసింది. ధీరజ్ పై కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పులకు కారణాలు తెలుసుకుంటున్నారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులపై గతంలోనూ అనేకసార్లు కాల్పులు జరిగాయి. దీంతో భద్రత గురించి వారు వర్రీ అవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.