Andhra Minister Goutham Reddy : మేకపాటికి నివాళులర్పించిన నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు

మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్ లో మరణించిన ఏపీ ఐటీ శాఖమంత్రి  మేకపాటి గౌతంరెడ్డి మతి పట్ల   నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయ

Andhra Minister Goutham Reddy : మేకపాటికి నివాళులర్పించిన నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు

Andhra Pradesh Minister Goutham Reddy :  మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్ లో మరణించిన ఏపీ ఐటీ శాఖమంత్రి  మేకపాటి గౌతంరెడ్డి మతి పట్ల   నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సంతాపం తెలిపి ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

నివాళులర్పించిన వారిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. గౌతంరెడ్డి మృతిపట్ల ఏపీ ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.  ఎల్లుండి నెల్లూరు  జిల్లా బ్రహ్మణ పల్లిలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పరిశ్రమల శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు…తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు దఫాలు MLA గానూ, ఎంపీ గానూ అనేక పదవుల్లో రాణించి రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ శైలి కలిగిన రాజకీయ నేతగా కొనసాగారు. మంత్రి గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కేంద్రం దగ్గరలోని మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి.

2-11-1971 న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి విద్యాభ్యాసం గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ లో, UK లో MSC టెక్స్ టైల్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. తర్వాత వ్యాపార రంగంపై ఆసక్తితో 1997 లో KMC కనస్ట్రక్షన్స్ పేరుతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు.

2014 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున రాజకీయ రంగ ప్రవేశం చేసి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో మళ్ళీ రెండో దఫా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వై.యస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ,ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్యం, చేనేత, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలు దక్కించుకున్నారు.మేకపాటి గౌతమ్ రెడ్డి కి భార్య శ్రీ కీర్తి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

ఎంతో ఫిట్‌గా ఉండే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బాడీ బిల్డర్ అని తెలుస్తోంది. గడిచిన వారం రోజులుగా దుబాయ్ లో జరిగిన పరిశ్రమలకు సంబంధించి ఎక్స్‌పో పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలు పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నిన్న హైదరాబాద్‌కు రావడం, ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించడంతో ఈ విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
Also Read :Mekapati Goutham Reddy : మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల వెంకయ్యనాయుడు సంతాపం

50 సంవత్సరాల వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు తీవ్ర షాక్ కి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు,ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.