MLA Anil Kumar Yadav : మీరు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా- ఆ ముగ్గురికీ ఎమ్మెల్యే అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)

MLA Anil Kumar Yadav : నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలుగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తమ సస్పెన్షన్ పై ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.

తాజాగా వారిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు.

Vijayawada Lok Sabha Constituency : జెండా పాతాలని వైసీపీ ప్రయత్నాలు.. ఫ్యాన్‌ పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ ఎత్తులు.. సెగలు రేపుతోన్న విజయవాడ పార్లమెంట్ రాజకీయం !

అలా కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. ఒకవేళ నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా? అని వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.

”2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం. ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు.(MLA Anil Kumar Yadav)

Minister Roja: నలుగురు బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్

పది స్థానాలు కాదు. వెళ్లిన ముగ్గురు ముందు గెలవండి. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా. గెలుస్తా. నన్ని ఆపండి. చూద్దాం. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు. కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు” అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నుంచి సస్పెండ్ వారిలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

Also Read..MP Nandigam Suresh : క్రాస్ ఓటింగ్ చేశారనే శ్రీదేవి సస్పెండ్.. ఆమెకు ప్రాణ హాని వైసీపీతో కాదు టీడీపీతోనే : ఎంపీ నందిగం సురేష్

చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఒక్కొక్కొరిని రూ.15 నుంచి 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. తమ అంతర్గత దర్యాప్తులో ఈ విష‍యం వెల్లడయిందన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.(MLA Anil Kumar Yadav)

ట్రెండింగ్ వార్తలు