ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒకరు మృతి

ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరింది.

ఏపీలో కొత్తగా 120 కరోనా కేసులు, ఒకరు మృతి

new corona cases in andhra pradesh: ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7వేల 177 మంది కొవిడ్ కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 82వేల 763కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,43,56,138 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,646కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 176 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2లక్షల 96వేల 916కి చేరింది.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజువారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడిచిన 24 గంటల్లో 20వేల 652 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. రికవరీ కేసులు రోజూ పెరుగుతున్నాయని ఆనంద పడదామన్నా… కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటివరకు కోటి 12లక్షల 62వేల 707 మందికి కొవిడ్ సోకగా.. కోటి 9లక్షల 20వేల 046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది.