జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు..పునర్విభజన కమిటీకి అనుబంధంగా ప్రత్యేక సబ్ కమిటీలు

  • Published By: bheemraj ,Published On : August 22, 2020 / 03:19 PM IST
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు..పునర్విభజన కమిటీకి అనుబంధంగా ప్రత్యేక సబ్ కమిటీలు

జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటి, నిర్మాణాత్మక సిబ్బంది, పునర్విభజన అధ్యాయనానికి రెండో సబ్ కమిటి, ఆస్తులు మరియు మౌళిక సదుపాయాల అధ్యాయనానికి మూడో సబ్ కమిటి, ఐటి సంబంధిత పనుల అధ్యాయనానికి నాలుగో సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సబ్ కమిటీల సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 10 మంది సభ్యుల జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు.



జిల్లాల పునర్విభజన వ్యవహరంపై ఏపీ ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోంటుంది. దీనికి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ మరియు సబ్ కమిటీలకు సహాయం చేయడానికి జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరే చైర్మన్ గా 10 మంది సభ్యులతో జిల్లా కమిటీ ఉంటుంది. ఏపీ ఎఫ్ఎస్ఎస్ పీ ఈవో అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ ప్రత్యేక కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్ర స్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన మీద అధ్యయన కమిటీ అధ్యయనం చేయాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని చూడాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రాథమికంగా ఆరు నెలలపాటు ఈ కార్యాలయాలు కొనసాగుతాయని కూడా ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్ కమిటీలు, జిల్లాస్థాయి కమిటీల కార్యాలయాల బాధ్యతలన్నీ చూసుకునేట్లుగా ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేశారు.



దీన్ని బట్టి చూస్తే త్వరలోనే జిల్లాల పునర్విభజన వ్యవహారం ఉండేట్లుగా చూడొచ్చు. స్థానిక సంస్థల నిర్వహణ కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆ లోపలనే ఈ రాష్ట్ర స్థాయి కమిటీలు, సబ్ కమిటీలు దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేసి ఆ లోపలనే జిల్లాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.