Tirumala : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి.

Tirumala : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు

Srivari (1)

New rules for Srivari devotees : తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అన్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని కోరారు.

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు నేటి నుంచి విడుదల కానున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 9గంటలకు 3వందల రూపాయలకు సంబంధించిన 12వేల టికెట్లను విడుదల చేయనున్నారు. రేపు ఉదయం నుంచి 10వేల సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నారు.

Tirumala : అక్టోబ‌రు 31 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు ఇవాళ, రేపు విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.

అలాగే ఈ నెల 23న నవంబర్‌ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనుంది. రోజులకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనుంది. సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను మూసివేశారు.