ఏపీలో కొత్త ఇసుక పాలసీ విధానం : కేబినెట్ ఆమోదం, ఆన్ లైన్ విధానానికి స్వస్తి

  • Published By: madhu ,Published On : November 5, 2020 / 03:28 PM IST
ఏపీలో కొత్త ఇసుక పాలసీ విధానం : కేబినెట్ ఆమోదం, ఆన్ లైన్ విధానానికి స్వస్తి

New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్‌లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్‌. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.. దీని ప్రకారం తొలుత ఇసుక రీచ్‌ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని కమిటీ సూచించింది.



కేంద్ర సంస్థలు ముందుకు రాని పక్షంలో పెద్ద సంస్థలకు అప్పగించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫారసు చేసింది. ఇసుక రీచ్‌లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాల్సి వస్తే ఓపెన్‌ టెండర్‌ విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. ఈ అంశాలన్నింటిపై చర్చించిన కేబినెట్‌.. సబ్‌ కమిటీ సిఫార్సులను ఆమోదించింది. ఆన్ లైన్ విధానానికి స్వస్తి పలికింది. మంత్రివర్గ ఉపసంఘం నియమించిన సంగతి తెలిసిందే. లోపభూయిష్టంగా ఉన్నట్లు తేల్చింది. దీంతో ఇసుక విధానాన్ని పూర్తిగా మార్చివేయాలని డిసైడ్ అయ్యింది.



https://10tv.in/ap-cabinet-meeting-changes-in-sand-policy/
మరోవైపు చంద్రబాబు హయాంలో ఇసుకలో విపరీతంగా దోచేశారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కానీ, ప్రజలకు ఇసుక 5 వేలకే వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రోజుకో ఇసుక పాలసీ తెస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తెస్తున్న పాలసీ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఇసుకలో గ్లోబల్‌ టెండర్లు పిలవాలన్నారు.



వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీపై సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. అయితే ఈ పాలసీతో ప్రభుత్వానికి మంచి జరగకపోగా.. తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు ఇసుక పాలసీని సరిదిద్దేందుకు సిద్దం అయ్యారు. ఇసుక పాలసీని మార్చి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు.



వినియోగదారునికి ఇబ్బందిగా ఉన్న నిబంధనలను మార్చి, అనుకూలమైన విధానాన్ని రూపొందించే పనిలో సంబంధిత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ విధానం ద్వారా జరిగే నష్టాన్ని, ప్రభుత్వానికి వచ్చిన అప్రతిష్టను తొలగించుకునేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.