మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో మరో ట్విస్ట్, ఆ మార్పులు చేస్తున్నది ఎవరు?

మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో మరో ట్విస్ట్, ఆ మార్పులు చేస్తున్నది ఎవరు?

new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైన కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యల సోషల్ మీడియా ఖాతాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా పెద్దకూతురు అలేఖ్య ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో మార్పులు జరుగుతున్నాయి. అలేఖ్య ఇన్ స్టా ఎకౌంట్ లో సెట్టింగ్స్ రోజురోజుకు మారుతున్నాయి. దీంతో వారిని ఫాలో అవుతున్న వారితో పాటు పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా అలేఖ్య ఇన్ స్టా పేజ్ ప్రైవేట్ గా మారడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. గత నెల 29న అలేఖ్య ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత అకౌంట్ ను తొలిగించినట్టు చూపించింది. హత్యలు జరిగిన తర్వాత పబ్లిక్ అకౌంట్ గా ఉన్న అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో సోమవారం సెట్టింగ్స్ మారిపోయాయి. ఆమె అకౌంట్ ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్ గా మారిపోయింది. అసలు ఆ సెట్టింగ్స్ ఎవరు మార్చారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

అయితే జనవరి 31నాటికి అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ లో 318మంది ఫాలోవర్స్ ఉండగా, ఆ తర్వాతి రోజుకి ఆ సంఖ్య 317కి తగ్గింది. ఇన్ స్టాగ్రామ్ యాజమాన్యమే సెట్టింగ్స్ మారుస్తోందా? లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

అంతేకాదు మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలుతాజాగా మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న సందేహాలు తలెత్తున్నాయి.

పురుష్తోతం, పద్మజ దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని.. పురుషోత్తమ నాయుడును కలిసి మాట్లాడారు. జంట హత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె తెలిపారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైల్లో కలిశారు.

ఈ హత్యలకు ప్రేరేపించింది మాత్రం వేరే వ్యక్తులు కచ్చితంగా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో పురుషోత్తం దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. వారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన డాక్టర్లు ఆ ఇద్దరికి కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్‌ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల సూచనతో పోలీసులు ఆ దంపతులను విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు.