New Year-2023 celebrations : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. కేక్ కటింగ్స్, డ్యాన్స్, కేరింతలతో సందడి

విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ తెలుగు ప్రజలు కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

New Year-2023 celebrations : విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ తెలుగు ప్రజలు కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2023 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. హైదరాబాద్ లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడుకల్లో యువత ఉత్సహంగా పాల్గొంది. కేక్ కటింగ్స్, డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు.

హ్యాపీ న్యూఇయర్ అంటూ బైక్ లపై షికారు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తోపాటు హన్మకొండ, వరంగల్, విజయవాడ, విశాఖ బీచ్ రోడ్డు, తిరుపతి తదితర చోట్ల సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో చిన్న, పెద్ద కలిసి ఆడిపాడారు. డీజే సౌండ్స్ కు డ్యాన్స్ ఎంజాయ్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్ లో ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించారు.

New Year Celebrations: ప్రపంచంలో తొలుత ఏ దేశంలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారో తెలుసా?

వీటిలో పెద్ద ఎత్తున యువత పాల్గొని కేరింతలు కొడుతూ నయా సాల్ కు వెల్ కమ్ చెప్పింది. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. 2023లో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు