మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు

మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు

Andhra Pradesh timings of liquor shops : న్యూ ఇయర్ వస్తోంది. కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు జనాలు సిద్ధమౌతున్నారు. కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. కొత్త కరోనా స్ట్రైయిన్ కూడా భయంకంపితులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. తాజాగా..మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణలో దుకాణాల బంద్ విషయంలో రాత్రి మరో గంట వెసులుబాటు కల్పించింది తెలంగాణ సర్కార్. ః

అయితే..ఏపీలో మందుబాబులకు సీఎం జగన్ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ వినిపించింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఇయర్ మద్యం దుకాణాల టైమింగ్ విషయంలో మార్పులు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో దుకాణం బంద్ లో మరో గంట ఎక్కువ టైమ్ కేటాయించిన సంగతి తెలిసిందే. కానీ..ఏపీలో మాత్రం ఎలాంటి వెసులు బాటు కల్పించలేదు. యథావిధిగా మద్యం అమ్మకాల వేళలు జరుగనున్నాయి. 2020, డిసెంబర్ 31వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 09 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో…ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 01 అన్ని రకాల వేడుకలను రద్దు చేసింది. న్యూ ఇయర్ క్రమంలో..డిసెంబర్ 31వ తేదీ, జనవరి 01న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలుకానున్నాయి.