Home » Andhrapradesh » పెళ్లైన మర్నాడే భర్త ఇంటిలో బంగారం,నగలు తీసుకుని వధువు పరార్
Updated On - 2:14 pm, Fri, 5 March 21
newly married bride elopsed, cash and gold with lover in anantapur district : ఇటీవలి కాలంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు చాలా వెలుగు చూస్తున్నాయి. పెళ్లైన మరుసటి రోజే భర్త ఇంట్లోంచి బంగారం, నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది ఒక నవ వధువు.
అనంతపురం జిల్లాలోని పెద్ద పప్పూరు మండలం కమ్మవారి పల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి అనే వ్యక్తి భార్య ఆరునెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకోటానికి ఫిబ్రవరి 29న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
మార్చి 1వ తేదీన ఆ మహిళ కేశవమురళి ఇంటికి కాపురానికి వచ్చింది. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న ముడు తులాల బంగారం, రూ.80 వేలు నగదు తీసుకుని పరారయ్యింది. తెల్లావారి లేచి చూసుకున్న మురళీ భార్యతోపాటు నగలు, నగదు పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు ఒడిషాలో ప్రియుడితో కలిసి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆమెకోసం గాలింపు చేపట్టారు.
బులెట్ ఇస్తానని అపాచి బైక్ ఇస్తారా?..అంటూ ఊరేగింపులో బట్టలు విప్పేసి వరుడు హంగామా..పెళ్లి వద్దు పొమ్మన్న వధువు
Ganapati Idol : రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం..
పెళ్లిలో పుట్టుమచ్చ షాక్ : కూతురే కోడలు కాబోతుందని తెలిసింది..కానీ పెళ్లి ఆగలేదు..!!
Rape Attempt : ఇంటికి తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు అత్యాచారయత్నం, ఫొటోలతో బ్లాక్ మెయిల్
nizamabad : నిజామాబాద్ లో పెళ్లి, 86 మందికి కరోనా
ఎట్టకేలకు పెళ్లి సంబంధాల వెల్లువ… తనకు పెళ్లికూతురిని చూసి పెట్టాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్న 2 అడుగుల మరుగుజ్జుకి మంచి రోజులు