Kurnool Baby kidnap: ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులో ట్విస్టు.. నర్సుపై పోలీసుల అనుమానాలు

ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.

Kurnool Baby kidnap: ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులో ట్విస్టు.. నర్సుపై పోలీసుల అనుమానాలు

Kidnapping Case

Kurnool Just Baby kidnap case : ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. శిశువు కిడ్నాప్ కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. బురఖా వేసుకున్న మహిళతో కలిసి నర్సే చిన్నారిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

రెండు రోజులు క్రితం ఆదోని ఆసుపత్రిలో ప్రసవించిన మహిళ పాపను కనిపించకుండాపోయిన ఘటన సంచలన కలిగించింది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా బురఖా వేసుకున్న మహిళ కనిపించింది. కానీ క్లియర్ గా దృశ్యాలు కనిపించకపోవటంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు చేపట్టారు.

రెండురోజుల సస్పెన్స్ అనంతరం పోలీసులు కేసులో నిందితులను పూర్తిగా గుర్తించకపోయినా గానీ..పాపను మాత్రం సురక్షితంగా దక్కించుకుని తల్లికి అందజేశారు. బురఖా వేసుకున్న మహిళే పాపను నర్సు సహాయంతో ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలా ఎత్తుకెళ్లిన పాపను ఓ దంపతులకు రూ.50 వేలకు అమ్మినట్లుగా తేలింది. పాపను కొనుక్కుకున్న దంపతులు ఓ నర్సు మాకు ఈ బిడ్డను అమ్మిందని చెప్పటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా ముగ్గురు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మందగిరి ప్రాంతంలోని దంపతులకు అమ్మినట్లుగా తెలుసుకున్న పోలీసులు వారి నుంచి పాపను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. కానీ ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అనే విషయం మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. దీంతో పోలీసులు ఈ కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు?ఇంకా ఎంతమంది ఉన్నారు? పాపను కిడ్నాప్ చేయించాల్సి అవసరం ఎవరికి ఉంది? ఓగ్యాంగ్ ఉందా? ఇంకా ఎంతమంది శిశువులను కిడ్నాప్ లు చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆదోనితో పాటు మొత్తం జిల్లాను జల్లెడ పడుతున్నారు. సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.