Weather Report For AP : అల్పపీడన ప్రభావంతో వచ్చే 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని.... రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.

Weather Report For AP : అల్పపీడన ప్రభావంతో వచ్చే 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు

Ap Rains

Weather Report For AP : ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని…. రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు. ఈ అల్పుపీడనం మరింత బలపడి దక్షిణ ఒడిసా-ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది.

దీని ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.రానున్న 2 రోజులూ ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. కర్నూలులో 35.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.