Kodali Nani On ChandrababuNaidu : ఈసారి పుత్రుడిని, దత్త పుత్రుడినే కాదు చంద్రబాబునీ ఓడిస్తాం-కొడాలి నాని

ఎవరెన్ని చేసినా 55 శాతం ఓటింగ్ జగన్ దే అన్నారు. జగన్ కి వ్యతిరేకత ఉంటే పొత్తులు ఎందుకు? సింగిల్ గా రా? అని సవాల్ విసిరారు. (Kodali Nani On ChandrababuNaidu)

Kodali Nani On ChandrababuNaidu : ఈసారి పుత్రుడిని, దత్త పుత్రుడినే కాదు చంద్రబాబునీ ఓడిస్తాం-కొడాలి నాని

Kodali Nani On Chandrababu

Kodali Nani On ChandrababuNaidu : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొత్తుల అంశం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. పొత్తుల పై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. విపక్షాలు పొత్తుల గురించి ప్రస్తావిస్తుంటే.. సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.

నిన్న మొన్నటి వరకూ టీడీపీకి దొంగ చాటుగా పవన్ కళ్యాణ్ పని చేశారని కొడాలి నాని ఆరోపించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించింది కూడా చంద్రబాబు కోసమే అన్నారు. 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికి వేరుగా పోటీ చేసినట్టు నటించారని అన్నారు. 2014 నుండి పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని.. చివరి వరకూ కలిసే ఉంటారని కొడాలి నాని తేల్చి చెప్పారు.(Kodali Nani On ChandrababuNaidu)

YCP sajjala : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది-సజ్జల

ఎంతమంది గుంపులుగా వచ్చినా జగన్ సింహంలా రెడీగా ఉన్నారని అన్నారు. ఎవరెన్ని చేసినా 55 శాతం ఓటింగ్ జగన్ దే అన్న కొడాలి నాని, మిగిలిన 45 శాతం ఓటింగ్ లో మీరు పోటీ పడండి అని అన్నారు. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ కి వ్యతిరేకత ఉంటే ఇంకొకరితో పొత్తులు ఎందుకు? సింగిల్ గా రా? అని సవాల్ విసిరారు కొడాలి నాని.

Next Time Will Defeat Chandrababu Also, Says Kodali Nani

Next Time Will Defeat Chandrababu Also, Says Kodali Nani

చంద్రబాబు, పవన్ లకు 2024 ఎన్నికలే చివరివి అని, జగన్ చేతిలో చావు దెబ్బ తింటారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకి అధికారం కావాలి, పవన్ కి డబ్బు కావాల అని విమర్శించారు. పవన్, లోకేష్ లు ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని సవాల్ విసిరారు. ఈసారి పుత్రుడిని, దత్త పుత్రుడినే కాదు.. చంద్రబాబునీ ఓడిస్తామన్నారు కొడాలి నాని.

Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట

కేబినెట్ పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన త‌ర్వాత కొడాలి నాని తొలిసారిగా సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్‌తో సమావేశం అయ్యారు. మంత్రి ప‌ద‌విని కోల్పోయిన కొడాలి నాని ప్ర‌స్తుతం వైసీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.(Kodali Nani On ChandrababuNaidu)

Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్

2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. ఏపీలో అప్పుడే ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల నుంచి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుండ‌టం, వాటిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్‌తో కొడాలి నాని భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేకాకుండా ప్ర‌భుత్వంపై ఇటీవ‌లి కాలంలో విప‌క్షాల దాడులు పెరిగిన నేప‌థ్యంలోనూ ఈ భేటీపై ఆస‌క్తి నెల‌కొంది.

కాగా, రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. పొత్తులపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడం లేదని స్పష్టం చేశారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని వెల్లడించారు. ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని తెలిపారు.