విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 02:45 PM IST
విశాఖ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC

విశాఖ గ్యాస్ లీక్ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) సుమోటోగా స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులు జారీ చేసింది. ఏసీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో ఎన్ హెచ్ ఆర్ సీ తాఖీదులు ఇచ్చింది. ఘటనకు సంబంధించి విచారణ జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

ఈ దుర్ఘటనపై కేసు నమోదుకు సంబంధించిన వివరాలు, విచారణ తీరుపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. కేంద్ర కార్పొరేట్ ఎఫైర్ మంత్రిత్వశాఖకు నోటీసులు జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు, నిర్వహణపై వివవరణ ఇవ్వాలని ఆదేశించింది. గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

విశాఖ దుర్ఘటనను ఎలక్ట్రానిక్ మీడియాలో చూసిన మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్ సీ..దుర్ఘటనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర కార్పోరేట్ ఎఫైర్ మినిస్ట్రీకి కూడా నోటీసులు జారీ చేసింది. సమగ్ర నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 

దీంతోపాటు పోలీస్ శాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏ ఏ కేసులు నమోదు చేశారు? ఎటువంటి విచారణ జరుగుతుంది? దీనికి సంబంధించిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంది..? 
ఏ విధంగా బాధితులను ఆదుకుంది? దుర్ఘటన ఎలా జరిగింది? దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా కేంద్ర కార్పోరేట్ ఎఫైర్ మినిస్ట్రీ కూడా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటికే విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.