నిమ్మగడ్డ రమేశ్ కేసు..ముందే ఊహించిన ప్రభుత్వం ? తర్వాత ఏం చేయనుంది

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 06:29 AM IST
నిమ్మగడ్డ రమేశ్ కేసు..ముందే ఊహించిన ప్రభుత్వం ? తర్వాత ఏం చేయనుంది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ముందే ఊహించిందా ? వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేసిందనే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేస్తుండడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. 

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ఈ తరుణంలోనే..రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేశ్ కుమార్ విషయంలో కూడా ఇదే విధంగా తీర్పును వస్తుందని ప్రభుత్వం భావించి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

దీనిపై ముందుగానే ప్రభుత్వం కసరత్తు జరిపిందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత..సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తీర్పు కాపీ రాగానే..సుప్రీం తలుపులు తట్టాలని భావిస్తోంది. న్యాయ సలహాలు తీసుకొనేందుకు సీఎం జగన్..కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పారని సమాచారం.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రభుత్వం ఎక్కడా తొలగించలేదని, రాష్ట్రంలో ఎన్నికల సంఘ సంస్కరణలో భాగంగానే ఆయన పదవిని కోల్పాయారనే వాదన గట్టిగా వినిపించనుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్లో కొన్నింటిని సడలింపు చేసింది. ఏజ్ లిమిట్ ను మూడు సంవత్సరాలకు కుదించారు.

ఏదైనా రిటైర్డ్ జస్టిస్ ను పదవిలో కూర్చొబెట్టాలని, ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకూడదనే ఉద్ధేశ్యంతో ఆర్డినెన్స్ తీసుకరావడం జరిగిందని ముందు నుంచి వాదన వినిపిస్తోంది. కానీ హైకోర్టు మాత్రం నిమ్మగడ్డ వైపు మొగ్గు చూపింది. సుప్రీంకోర్టులో కూడా ఇదే విధంగా వాదన వినిపించాలని, నిబంధనలను గవర్నర్ ఆమోదించిన తర్వాత..ఆర్డినెన్స్ తీసుకరావడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Read: BIG BREAKING : నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టివేత