రాజకీయాల్లోకి రాను.. రిటైర్మెంట్ రోజే నిమ్మగడ్డ ప్రకటన

రాజకీయాల్లోకి రాను.. రిటైర్మెంట్ రోజే నిమ్మగడ్డ ప్రకటన

Nimmagadda Ramesh Kumar

Nimmagadda Ramesh Kumar:రిటైర్మెంట్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన రమేష్ కుమార్.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది అన్నారు. సీఎస్, డీజీపి పూర్తిగా సహకరించారని, ఇక నుంచి తాను ఓ సాధారణ పౌరుడినే అని అన్నారు. తన హక్కుల సాధనకు వెనుకాడనని.. తన విశేషాధికారాలను ఎన్నికల కోసమే ఉపయోగించనట్లు నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఇక నుంచి తాను ఓ సాధారణ పౌరుడిని అని, రాజకీయాల్లోకి రానంటూ స్పష్టం చేశారు. అటువంటి పొరపాటు చెయ్యనంటూ కీలక వ్యాఖ్యలు పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నిమ్మగడ్డ బీజేపీలో చేరుతారని వార్తలు రాగా.. ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ.. 243కే ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందని, ఎన్నికల కమిషన్ మిగిలిన బలమైన వ్యవస్థల్లో జోక్యం చేసుకోదని అన్నారు. వాటికి గౌరవం ఇవ్వాలని, వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.

ఇదే సమయంలో సాధారణ ఎన్నికల స్థాయిలో స్థానిక ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పిన నిమ్మగడ్డ.. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో అడిగానని.. అది నిరాకరించారని, ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళ్తానని అన్నారు.