NITI Aayog: జగన్ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌.

NITI Aayog: జగన్ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు

Rajeev

NITI Aayog: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నానని, సీఎం జగన్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రిమార్కబుల్ అంటూ కొనియాడారు. డిజిటల్ లైబ్రరీ, రైతు భరోసా కేంద్రాలు, వికేంద్రీకరణ దేశంలో ఎక్కడా లేని వినూత్న ఆలోచనలని ప్రసంశలు కురిపించింది నీతి అయోగ్‌.

మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చారని, కోవిడ్ వలన అనాథలైన పిల్లలకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారని తెలిపారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్. బుధవారం తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌ను రాజీవ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో అమలవుతున్న నవరత్నాలు, రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను అధికారులు నీతి అయోగ్‌ బృందానికి వివరించారు.

Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు

ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని అధికారులు కోరారు. కోరాపుట్, బాలంగీర్, బుందేల్ ఖండ్ తరహాలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ రంగ సమస్యలను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.

Tirupati tiruchanuru : ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగమ్మ

ఈ సందర్భంగా రాష్ట్రానికి నీతి ఆయోగ్ అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందించాలని కోరారు సీఎం జగన్‌. రుణభారంతో సతమతమవుతోన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను ఆదుకోవాలని.. వాటిని గాడిలో పెట్టేందుకు తగిన సాయం చేయాలని నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు.