COVID 19 : ఏపీలో కరోనా..కొత్త కేసులు మాత్రమే, మరణాల్లేవు

24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

COVID 19 : ఏపీలో కరోనా..కొత్త కేసులు మాత్రమే, మరణాల్లేవు

Ap Corona

COVID A.P : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా వెలుగు చూస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎలాంటి కేసులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. కానీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో రాష్ట్రం అలర్ట్ అయ్యింది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Mike Tyson : మా దేశీయ గంజాయికి అంబాసిడర్‌గా ఉంటావా? మాలావీ ప్రభుత్వం రిక్వెస్ట్!

2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం 184, నవంబర్ 25వ తేదీ గురువారం 183 కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,69,551 పాజిటివ్ కేసులకు గాను…20,52,961 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,432 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 వేల 158గా ఉందని తెలిపింది.

Read More : UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

కృష్ణా జిల్లాలో అత్యధికంగా 56 మంది వైరస్ బారిన పడ్డారు. 28 వేల 509 శాంపిల్స్ పరీక్షించగా…248 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 253 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,03,44,770 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 10. చిత్తూరు 28. ఈస్ట్ గోదావరి 38. గుంటూరు 39. వైఎస్ఆర్ కడప 12. కృష్ణా 56. కర్నూలు 1. నెల్లూరు 15. ప్రకాశం 04. శ్రీకాకుళం 16. విశాఖపట్టణం 15. విజయనగరం 00. వెస్ట్ గోదావరి 14. మొత్తం : 248.