Adimulapu Suresh : ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్

ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.

Adimulapu Suresh : ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్

Adimulapu Suresh

Adimulapu Suresh : కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చి చెప్పారు.

సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. స్కూళ్లకు సెలవుల పొడిగింపుపై సోమవారం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం నడిచింది. ఇంతలోనే పాఠశాలలకు సెలవులు పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

సెలవులు పొడిగించే అవకాశం లేదని మంత్రి తేల్చి చెప్పడంతో.. రాష్ట్రంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోన్నాయి. కాగా, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 13.87 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదని భావిస్తున్నారు. భారీగా కేసులు పెరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళ‌నకర రీతిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35వేల 673 కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4వేల 955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 21,01,710 కి చేరాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,509 కి చేరింది.

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 397 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22వేల 870కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,64,331 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.