నిరసన హోరు : అమరావతి ముంపు ప్రాంతం కాదు..మోడీ ఆదుకోవాలి

  • Published By: madhu ,Published On : December 22, 2019 / 05:56 AM IST
నిరసన హోరు : అమరావతి ముంపు ప్రాంతం కాదు..మోడీ ఆదుకోవాలి

చేతులెత్తి మొక్కి చెబుతున్నాం..న్యాయం చేయండి..మీరన్న మాటలే నెరవేర్చాలి..అమరావతి ముంపు ప్రాంతం..రాజధాని కుదరదు..మూడు రాజధానులు చేస్తామంటున్నారు…ఎందుకు ముంపు ప్రాంతం అని ప్రశ్నిస్తున్నారు ఉద్దండరాయుని పాలెం మహిళలు.

మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10tvతో వారు మాట్లాడుతూ…

అమరావతికి ఎప్పుడూ ముంపుకు గురి కాలేదన్నారు. భూములు స్వచ్చదంగా ఇచ్చామని, ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. వైజాగ్ ముంపు ప్రాంతం కాదా ? అని ప్రశ్నించారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పిన మోడీ..తమను కాపాడాలని కోరారు. సీఆర్డీఏ అధికారులు కూడా బాధ్యత వహించాలని సూచించారు. శంకుస్థాపన చేసిన సమయంలో అమరావతి రాజధానికి అనుకూలమని ఆనాడు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. 

* రాజధానిలో ఆందోళనలు 5వ రోజు కంటిన్యూ అవుతున్నాయి. 
* వెలగపూడిలో 5వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు.
* మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలకు భధ్రతను పెంపు. 
 

* ఉద్దండరాయుని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో మహిళల నిరసన. 
* తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమి గ్రామాల్లో మహా ధర్నా. 
* ప్రధాని మోడీ చిత్రపటంతో తుళ్లూరు రైతులు బైఠాయింపు.
* రాజధాని ఇక్కడే ఉంచాలని డిమాండ్. 
Read More : రాజధానిలో ఆందోళనలు 5వ రోజు : మంగళగిరి, తాడికొండ MLAలకు భద్రత పెంపు