ఓటరు కార్డు లేకున్నా ఓటెయ్యవచ్చు

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 10, 2019 / 12:22 PM IST
ఓటరు కార్డు లేకున్నా ఓటెయ్యవచ్చు

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం (ఏప్రిల్11,2019) దేశవ్యాప్తంగా 91లోక్ సభ స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగనుంది. అయితే పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.
Read Also : ముద్దంటూ కొరికేశాడు : 300ల కుట్లు..12 ఏళ్ల జైలు

ఓటు వేయడానికి ఓటు కార్డు తప్పనిసరిగా ఉండనవసరం లేదు.ఓటర్ల జాబితాలో పేరు ఉంటే, ఓటరు కార్డు లేకపోయినా వేరే గుర్తింపు కార్డు చూపించయినా ఓటు వేయవచ్చు.ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఓటరు స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం నిర్ణయించిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటరు స్లిప్పు గుర్తింపు కాదు. ప్రతి ఓటరు స్లిప్పుతో పాటు విధిగా గుర్తింపు కార్డును తీసుకు వెళ్ళాల్సిందే.

ఓటరు ఫొటో గుర్తింపు కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు, పాస్‌ పోర్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల సర్వీసు గుర్తింపు కార్డులు, ఫొటో పింఛను పత్రం, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డుల్లో ఏదైనా ఒకదానిని మీ ఐడెంటిటీని తెలపటానికి ఉపయోగించవచ్చు.
Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్