Kodali Nani : భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదు : మంత్రి కొడాలి నాని

భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇవే షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ సినిమా కాబట్టి తొక్కేయాలనే ఉద్దేశం లేదన్నారు.

Kodali Nani : భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదు : మంత్రి కొడాలి నాని

Kodali Nani

AP Minister Kodali Nani : భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. సీఎం జగన్ పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాను తొక్కేశారని విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా షరతులు పెట్టలేదని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇవే షరతులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ సినిమా కాబట్టి తొక్కేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటేనని తేల్చి చెప్పారు.

అందరికీ ఒకటే నియమం, ఒకటే సిద్ధాతం అని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజలు గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు. జగన్ శత్రువులు, మిత్రుల గురించి ఆలోచించరని తెలిపారు. సినిమాతో రాజకీయాలు చేయ్యొదని హితవుపలికారు. పవన్ కళ్యాణ్ తల్లి లాంటి సినిమాను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ కు అందాల్సిన రెమ్యునరేషన్ అందిందని పేర్కొన్నారు. సినిమా ఆడినా, ఆడకపోయినా పవన్ కు నష్టమేమీ లేదన్నారు.

Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ

బ్లాక్ టికెట్ల పేరుతో దోచుకుంటామంటే కుదరదన్నారు. టికెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జీవో విడుదలపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సివుందన్నారు. పవన్, జగన్ కు యుద్ధంలా చూపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగన్ ను అధికారంలో నుంచి దించాలని కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రయత్నాల్లో బలిపశువులు కావద్దని సూచించారు.

భీమ్లా నాయక్‌ సినిమాపై.. పొలిటికల్‌ యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్‌పై పగబట్టిందని మెగాబ్రదర్‌ నాగబాబు అన్నారు. పవన్‌ను ప్రభుత్వం టార్గెట్‌ చేసినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా ఉండేది ఐదేళ్లు మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వం కక్షతోనే టికెట్ రేట్లను తగ్గించిందన్నారు.

MLA Roja: పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం మాకు లేదు – ఎమ్మెల్యే రోజా

నాగబాబు వ్యాఖ్యలకు సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ఫ్యాన్స్‌కు ప్రభుత్వం మంచే చేసిందన్నారు. పవన్‌పై కుట్ర జరుగుతోందనేది అవాస్తవమని పేర్కొన్నారు. అన్యాయం చేసినట్లు మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. పవన్‌ను అన్యాయం జరగడానికి ఆయనేమీ ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్ కాదన్నారు. పుష్ప, అఖండ సినిమాలు ఏ రేట్లతో అయితే ఆడాయో.. అదే రేట్లతో ఏపీలో భీమ్లా నాయక్‌ సినిమా నడుస్తోదని క్లారిటీ ఇచ్చారు.