Railway Zone : ఏపీకి రైల్వే జోన్ లేనట్టే.. పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.

Railway Zone : ఏపీకి రైల్వే జోన్ లేనట్టే.. పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్రం

Railway Zone : ఏపీకి ఇక రైల్వే జోన్ రాదని తేలిపోయిందా? వైజాగ్ రైల్వే జోన్ సంగతి మర్చిపోవాల్సిందేనా? అంటే.. అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ఇక రైల్వే జోన్ రాదని తేలిపోయింది. దేశంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఇక కొత్త రైల్వే జోన్లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

Army Chopper Crash : బిపిన్ రావత్ మినహా హెలికాఫ్టర్ లోని అందరూ మృతి

దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు కొత్త జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని ప్రకటించారు. కాగా, మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా కూడా వైజాగ్ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించ లేదు. రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై గతంలో ఓఎస్డీని నియమించి కేంద్రం చేతులు దులుపుకుంది. రైల్వే జోన్ పై కేంద్రానికి ఓఎస్డీ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై కేంద్రం ఎటూ తేల్చలేదు.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

కేంద్రం తాజా ప్రకటనతో ఇక ఏపీలో రైల్వే జోన్ అసాధ్యం అని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రైల్వేజోన్ అంశంపై కేంద్రం దగ్గర ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం ప్రస్తావించలేదు. జగన్ ప్రభుత్వం అచేతనం కారణంగానే ఏపీ రైల్వే జోన్ ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు.