నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్‌లు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, జిల్లాలలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
Read Also : బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్‌లను అధికారులు తీసుకుంటారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. 26న నామినేషన్ల పరిశీలన చేసి, 28వరకూ ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన నిర్వహించనున్నారు.
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

×