Kurnool: వైరల్ వీడియో.. రైతు పొలంలో లంచం తీసుకున్న అధికారులు

Kurnool: వైరల్ వీడియో.. రైతు పొలంలో లంచం తీసుకున్న అధికారులు

Kurnool

Kurnool: పొలం సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు రైతు దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు మధ్యవర్తి ద్వారా వారికి డబ్బు అందించాడు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకునే సమయంలో వీడియో తీసి భద్రపరిచారు. కాగా ఆ వీడియో మంగళవారం బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం సర్వే చేసేందుకు సర్వేయర్ శ్రీదేవి, వీఆర్వో రామాంజనేయులు వచ్చారు. పొలం సర్వే పూర్తైన వెంటనే తమకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రైతు రూ.10 వేలను వేరే వ్యక్తికి ఇచ్చి పొలం వద్దకు పంపాడు.

ఈ డబ్బు వీఆర్వో చేతికి ఇచ్చాడు సదరు వ్యక్తి.. ఆ తర్వాత వీఆర్వో అందులోని ఐదు వేలు తీసి సర్వేయర్ కు ఇచ్చాడు. ఈ సమయంలో సర్వేయర్ శ్రీదేవి అంతకు ముందు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ ఇచ్చారు అంటూ..ఇప్పుడు ఇచ్చిన ఐదు వేలు సరిపోవన్నట్లు మాట్లాడారు.

వెంటనే వీఆర్వో అవన్నీ నేను చూసుకుంటా అంటు సర్వేయర్ కు చెప్పాడు. కాగా అక్కడ ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించారు.. అయితే ఆ వీడియోలు మంగళవారం బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయా? లేదా? అన్నది తెలియరాలేదు.