OMG Nithya : ఆ అమ్మాయి నేను కాదు, నాకు సంబంధం లేదు, ఆ వీడియోలు డిలీట్ చేయండి.. టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసుపై నిత్య స్పందన

మైనర్‌ బాలిక(14) అత్యాచారం కేసులో టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. భార్గవ్‌.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’ పేరును తెరపైకి తెచ్చారు. భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్, నిత్య ఉన్న ఫోటోలను తెగ వాడేస్తున్నారు. దీంతో కలవరపడ్డ నిత్య దీనిపై స్పందించింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నిత్య స్పష్టం చేసింది. ఆ అమ్మాయి నేను కాదు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది.

OMG Nithya : ఆ అమ్మాయి నేను కాదు, నాకు సంబంధం లేదు, ఆ వీడియోలు డిలీట్ చేయండి.. టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసుపై నిత్య స్పందన

Omg Nithya

OMG Nithya : మైనర్‌ బాలిక(14) అత్యాచారం కేసులో టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. భార్గవ్‌.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’ పేరును తెరపైకి తెచ్చారు. భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్, నిత్య ఉన్న ఫోటోలను తెగ వాడేస్తున్నారు. దీంతో కలవరపడ్డ నిత్య దీనిపై స్పందించింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నిత్య స్పష్టం చేసింది. ఆ అమ్మాయి నేను కాదు అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది.

Vizag's TikTok superstar

‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది.

OMG Girl Nithya Video

చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి ఏడాది పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. ప్రస్తుతం నేను షూటింగ్ లో ఉన్నా.

Tiktok Bhargav

ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్‌ వాళ్లు నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. మీరంతా తెలియక చేస్తున్నారని నేను ఈ వీడియోతో ముందుకు వచ్చా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో నిజాలు తెలుస్తాయి. అప్పుడైనా డిలీట్‌ చేయండి. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌లో ఉన్నా’ అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది నిత్య.

Fun Bucket Bhargav on Twitter

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను విశాఖ పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 20,2021) ఉదయం విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు తెలిపారు. భార్గవ్ నిజస్వరూపాన్ని పోలీసులు బయటపెట్టారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ నమ్మించి అత్యాచారం చేయడమే కాదు మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితునిపై అత్యాచారం తోపాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Nithya Sri Mother Gives Clarity On Tiktok Bhargav Issue

టిక్ టాక్ ద్వారా 14ఏళ్ల బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్‌ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే, పోలీసులను ఆశ్రయించాలని ఏసీపీ కాజల్‌ సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by Nithyasri (@omggirlnitya)