రోడ్డు తవ్వి ఏపీ నుంచి రాకపోకలు నిలిపేసిన తమిళనాడు వాసులు… రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 01:24 PM IST
రోడ్డు తవ్వి ఏపీ నుంచి రాకపోకలు నిలిపేసిన తమిళనాడు వాసులు… రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్తత

ఏపీ, తమిళనాడు సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రెండు రాష్ట్రాల రాకపోకలు నిలిచిపోయాయి. పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద తమిళనాడు వాసులు 
రోడ్డును తవ్వేశారు. ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సాగకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. తమిళనాడు అధికారులు, ప్రజల తీరుపై చిత్తూరు జిల్లా వాసులు తీవ్రంగా మండిపతున్నారు. రోడ్డును తవ్వి రాకపోకలు నిలిపివేతకు నిరసనగా వారం క్రితం ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న మూడు చోట్ల తమిళనాడు సిబ్బంది రోడ్డుకు అడ్డంగా 6 అడుగుల ఎత్తులో గోడలు నిర్మించిన సంగతి తెలిసింది. రాకపోకలను అడ్డుకున్నారు.

చివరికి వ్యవహారం తీవ్ర వివాదాస్పదం అవడంతో తమిళనాడు అధికారులే రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడలను తొలగించారు. ఆ ఘటన మరువకముందే ఇవాళ మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీ, తమిళనాడు సరిహద్దులో మరోసారి స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పిచ్చాటూరు మండలంలోని హనుమంతపురం పొలిమేరలో ఉద్రిక్తత చోటు చేసుుంది. ఈ గ్రామం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉంటుంది. 

రోడ్డును దాటకుండా ఏకంగా తవ్వేస్తున్నారు. దీనికి తమిళనాడు అధికారులు సహకారం అందించినట్లు సమాచారం. అయితే ఇలాంటి అనధికారిక తవ్వకాలు ఎలా జరుపుతారు? రోడ్డును ఎలా బ్లాకు చేస్తారు? అని తీవ్ర స్థాయిలో వాదించారు. కానీ తమిళనాడు సిబ్బంది, గ్రామస్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తవ్వాల్సిందే, చిత్తూరు జిల్లా నుంచి ఎవ్వరిని కూడా తమ రాష్ట్రంలోకి, గ్రామంలో అనుమతించబోమని ఆ రాష్ట్రం సిబ్బంది వాదిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది.

గోడ విషయంలో స్వయంగా వేలూరు జిల్లా కలెక్టర్ కల్పించుకుని వారం క్రితం ఆ మూడు గోడలను కూల్చి వేయించారు. ఇవాళ ఏకంగా రోడ్డుు అడ్డంగా కందకాలు తవ్వడం అనేది మరోసారి వివాదాస్పదం అవుతుంది. తమిళనాడు సర్కార్, స్థానిక జిల్లా అధికారులు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి మరి. ఒక రాష్ట్రంలోకి ఎంట్రీ కాకుండా నిలువరించవచ్చు గానీ రోడ్డుకు మధ్యలో తవ్వకాలు జరిపి ఎవరిని పోకుండా అడ్డుకోవడం మాత్రం సమంజసం కాదని చిత్తూరు జిల్లా వాసులు వాదిస్తున్నారు.