Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శనివారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు.

Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..

New Project (1)

Ysrcp bus yatra: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శనివారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సామాజిక విప్లవం దేశమంతా అవలంభించాలని సూచించారు. రాష్ట్రంలో 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందజేస్తున్నామని అన్నారు. కులాలకు ఎన్ని నిధులు ఇస్తున్నామని ముఖ్యం కాదని వారిని రాజ్యంగ పరంగా ఉన్న హక్కులను అందివ్వడమే ప్రధానమని పేర్కొన్నారు

Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..

సమసమాజ స్థాపనకు వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని వెల్లడించారు. వెనుకబడ్డ తరగతుల వారికి అట్టడగు స్థాయి నుంచి రాజకీయం వరకు అవకాశాలు కల్పిస్తున్నారని ప్రసంశించారు. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజేమహేంద్ర వరంకు బస్సు యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా రాజమహేంద్ర వరం మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ లు ఇందులో పాల్గొన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు సామజిక న్యాయాన్ని వివస్తూ ఆంద్రప్రదేశ్ లో మొదలైన మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు.

AP CM Ys Jagan : దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్

వైసీపీ మంత్రుల బస్సు యాత్ర శనివారం మూడోరోజుకు చేరుకుంది. ఉదయం 9గంటలకు ప్రారంభమై 10గంటలకు నారాయణపురం, 10.45 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా 11.30కి గన్నవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.15కు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మధ్యాహ్నం 1.00గంటలకు మంగళగిరి వరకు యాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 1.30 కి ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మంత్రులంతా లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 3.15గంటలకు గుంటూరు బైపాస్ మీదుగా సాయంత్రం 4గంటలకు చిలుకలూరి పేట చేరుకుంటుంది. సాయంత్రం 4.30 గంటలకు నర్సరావుపేటలో మంత్రులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో మూడవ రోజు యాత్ర ముగుస్తుంది.