Online Movie Ticket Booking : థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి

ప్రభుత్వ నిర్ణయంతో ఇటు ప్రజలకు అటు థియేటర్ యజమానులకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Online Movie Ticket Booking : థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి

Online Movie Ticket Booking

Online Movie Ticket Booking : ఆన్ లైన్ సినిమా టికెట్ల విధానంపై ప్రభుత్వం, ఎగ్జిబిటర్ల మధ్య సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల కృష్ణను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్స్ కలిశారు. థియేటర్ల యాజమాన్యాలకు ఆన్ లైన్ టికెటింగ్ పై అవగాహన లేదని మంత్రి వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇటు ప్రజలకు అటు థియేటర్ యజమానులకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రస్తుతం బుక్ మై షో, పేటీఎం వల్ల ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. అటు ప్రజలు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో రేపటి నుంచి థియేటర్లు మూసేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు డిస్ట్రిబ్యూటర్లు.

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు.

యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని అధికారులు అంటున్నారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు వివరించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ లో అమలు చేయాలని, అందుకు ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు వెల్లడించారు.