Corona Positive: నిర్లక్ష్యం.. పకోడీ బండి వ్యాపారికి కరోనా వచ్చినా కూడా

కరోనా వచ్చిన మొదట్లో దాని పేరు వింటేనే వణికి పోయారు. ఊర్లో ఒక్క కేసు నమోదైతే ఊర్లోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పక్కన కరోనా పేషెంట్ ఉన్న భయపడటం లేదు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ప్రజలు మాత్రం కంగారు పడటం లేదు.

Corona Positive: నిర్లక్ష్యం.. పకోడీ బండి వ్యాపారికి కరోనా వచ్చినా కూడా

Covid 19

Corona Positive: కరోనా వచ్చిన మొదట్లో దాని పేరు వింటేనే వణికి పోయారు. ఊర్లో ఒక్క కేసు నమోదైతే ఊర్లోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పక్కన కరోనా పేషెంట్ ఉన్న భయపడటం లేదు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ప్రజలు మాత్రం కంగారు పడటం లేదు.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో ఓ పకోడీ వ్యాపారి ఇటీవల కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆరోగ్య సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇంట్లో వారికి కూడా పరీక్షలు చేయించాలని.. వారిని ఆసుపత్రికి వెళ్ళమని ఆరోగ్య సిబ్బంది సూచించారు. అయితే పకోడీ వ్యాపారి ఆరోగ్య సిబ్బందికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

పకోడికోసం చేసిన పిండి కొంచం ఉంది.. పకోడీలు వెయ్యడం పూర్తి కాగానే వస్తానని తెలిపాడు. పకోడీ వ్యాపారి చెప్పిన సమాధానానికి హడలిపోయిన ఆరోగ్య సిబ్బంది హుటాహుటిన 108 తీసుకోని అతడు ఉండే ప్రాంతానికి వచ్చి చివాట్లు పెట్టి అంబులెన్స్ లో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీసుకున్నారు.