మానవత్వం మంటకలిసింది..... కరోనా బాధితుడు చనిపోతే... JCBలో తీసుకెళ్లారు

మానవత్వం మంటకలిసింది….. కరోనా బాధితుడు చనిపోతే… JCBలో తీసుకెళ్లారు

మానవత్వం మంటకలిసింది….. కరోనా బాధితుడు చనిపోతే… JCBలో తీసుకెళ్లారు

శ్రీకాకుళం జిల్లా పలాసలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి జాగ్రత్తగా ఉండాలని మనుషుల నుంచి దూరంగా ఉండటం మంచిదే. కొవిడ్ లక్షణాలతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీలో తరలించారు. శ్రీకాకుళం పలాస మునిసిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

శుక్రవారం ఉదయం వృద్ధుడు మృతిచెందాడు. శరీరానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. చనిపోవడానికి ముందు కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానంతో ఎవరూ శవాన్ని ముట్టుకోవడానికి దగ్గరికీ రాలేదు. 

కరోనా భయంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జేసీబీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ హృదయ విదారకమైన ఘటన గురించి కలెక్టర్ వరకూ సమాచారం అందించారు. విచారణకు ఆదేశించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. 

×